Header Banner

స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు..! ఇంటర్‌ పాసైతే చాలు..!

  Tue May 20, 2025 09:45        Employment

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌).. స్పోర్ట్స్‌ కోటా కింద కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 403 సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్‌ అర్హతతోపాటు ఈ కింది క్రీడాంశాల్లో ప్రవేశం ఉన్న యువత ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్‌ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

క్రీడా విభాగాలు ఇవే..

కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) 403 ఖాళీలను ఈ కింది క్రీడా విభాగాల్లో పాల్గొన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అవేంటంటే.. వుషు, త్వైకాడో, కరాటే, పెన్‌కాక్ సిలాట్, ఆర్చరీ, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఖోఖో, వాలీబాల్‌, సెపక్‌టక్రా, బాస్కెట్‌బాల్, టెన్నిస్‌, బ్యాడ్మింటన్, సైక్లింగ్‌, అథ్లెటిక్స్, బాక్సింగ్, హాకీ, షూటింగ్, జూడో, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్ , రెజ్లింగ్, బాడీ బిల్డింగ్‌.

పైన పేర్కొన్న క్రీడలతోపాటు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్ర లేదా జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించిన ఏదైనా క్రీడలో పాల్గొని ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయోపరిమితి ఆగస్టు 1, 2025 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల శారీరక ప్రమాణాలు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పురుషు అభ్యర్థుల ఎత్తు 167 సెం.మీ, మహిళా అభ్యర్థుల ఎత్తు 153 సెంటీమీటర్లు ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జూన్‌ 6, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.100 తప్పనిసరిగా చెల్లించాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ట్రయల్‌ టెస్ట్‌, ప్రొఫిషియన్సీ టెస్ట్‌, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం చర్చ! ఆ మూడు డిమాండ్లపై..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #SportsQuotaJobs #ConstableRecruitment #IntermediatePass #JobAlert #PoliceJobs #GovernmentJobs